Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

७४ వ్యాసమంజరి అయినను సంపూర్ణమైనయనుకరణము రెండు హేతువులచేత నసంభవము. నన్నయ్య యొక్క ప్రతిభ యసాధారణము, దానివంటి మూర్తిని సృష్టింప నేరికిఁ దరముకాదు. ఇఁక నెఱ్ఱన యన్ననో, తానును సామాన్యుఁడు కాఁడు; అనిరోధ్యమైన సహజ ప్రతిభాశాలి ; స్వతంత్రుఁడు. భావము ప్రధానమైనచోట్ల నసితరతుల్యమయిన మార్గ మున వెళ్లువాఁడు. ఆంధ్రరసికులయొక్క భాగ్యమే భాగ్యము, కవి త్రయము వారిని నొండురులతోఁ బోల్చి చూచుట కవకాశములుండుట వలన. ఇట్లనుటచే గురులఘుత్వనిర్ణయము సాధ్యమని యెన్నఁ బోకుఁడు. ఒక పువ్వు సొగసు వేరొక పువ్వును కుండదు. రెండును సమాన సౌందర్యములుగా నుండవచ్చును. ఇంచుమించుగ విషయము సామాన్యముగనుండుమట్టముల వారు వ్రాసియున్నారు. వానిని బట్టి వారియొక్క కవితారీతులఁ గనుఁగొనవచ్చును. నన్నయ్య ఎఱ్ఱన్నల పోలికల నరయుట కనువై నఘట్టము, కర్ణుని జననమున వానిని విడువవలసినవిధికై కుంతిచేయువిలాపము :- నన్నయ్య :- తరువోజ ఏల యముని నాకునిచ్చె నిమంత్ర మిమ్మంత్ర శక్తియే నెఱు గంగ వేఁడి యేలపుత్ర కు కుఁ గోరి యెంతయు భక్తి నినుఁదలంచితి బ్రీతి నినుఁడును నేల సద్యోగర్భమిచ్చేఁ గుమారుఁ డేల యప్పుడు యుదయించె నాకు సింకెట్టు లీలోకపరివాద మేనుడిగింతు నింతకు నింతయు నెఱుఁగరే జనులు. వసంతతిలకము, ఈబాలు నెత్తికొని యింటికిఁ జన్న నన్ను నాబంధులందఱు మనంబున నేమనా రె CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri