Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధ్యక్షునీవచనము ఉ. దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం భావితశ క్తి శౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర త్పావక తాపి తాఖిలవిపక్షులు నై సమహానుభావు లై రావతకోటి ఘోర ఫణిరాజులు మాకుఁ బ్రసన్ను లయ్యెడున్. ఉ. గోత్ర మహామహీధరనికుంజములన్ విపినంబులన్ గురు క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వ నేనుఁడై ధాత్రిఁ బరిభ్రమించు బలదర్పపరాక్రమదక్షుఁ డీక్షణ శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్ను ఁడయ్యెడు . ( ఆదిపర్వము, ఆశ్వా౧. పద్యములు ౧౦ ర . ) ఈ పద్యములు సముద్రమట్లు గంభీరములు. కొందఱు విమర్శ కులు ఎఱ్ఱాప్రెగ్గడ, తారచించిన ఆరణ్యపర్వశేషములో నన్నయ్య యొక్క శైలిని అనుకరించినాఁడనియు, నన్నయ్య ధోరణి యతని వ్రాఁతలో నద్దమునందువలెఁ బ్రతిబింబిత మైనదనియు వ్రాసియున్నారు. ఈ భ్రమకు ఎఱ్ఱాప్రెగ్గడయే కొంతవఱకుఁ గారణభూతుఁడు. ఆరణ్య పర్వాంతమునఁ " దత్కవి తారీతియుఁ గొంతఁ దోఁపఁ " దానును బూరిం చినట్లు వ్రాసికొనియుండుటఁజూచి, యా "కొంత " యను నుపాధిని మఱచి " పూర్ణముగా ” నని సంకల్పించు కొన్నా రేమో? రెండవది: నన్నయ్యను అనుకరించిన ట్లెల్లరకుఁ దెలియుటకై యాతని పద్యములఁ గొన్నిటిని నిర్లక్ష్యములైన మార్పులతోఁ దన భాగమున వేసికొని యుండుట :- చ. రయవిచలత్తురంగమ తరంగములన్ మదనాగనక్ర సం చయముల `సంచలచ్చటుల సైనిక మత్స్యములన్ భయంకరం బయి, యదు వృష్ణా' భోజ కుక రాంధక వారిధియుం గలంగె ని ర్దయతర రోష మారుత నితాంత సమీరితమై క్షణంబున౯. (సభాపర్వము, అశ్వా - పద్యము 33 ) CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri