Jump to content

పుట:VrukshaSastramu.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

అండకోశము
... అండాశయము ఉచ్చము 2 గదులు, కీలము గుండ్రము. కాయ ద్వివిదారుణ ఫలము.

ఆవ కుటుంబపు మొక్కలు శీతల దేశమునందేకాని ఉష్ణదేశము లందంతగా బెరుగంజాలవు. మన దేశములో నీ కుంటుంబపుమొక్కలు తక్కువ. వానిలో జాలభాగము కొండలమీదనేగాని పెరుగవు. వీనిలో ఆకులు ఒంటరి చేరిక. విశేషముగా లఘుపత్రములు. రక్షక పత్రములు, అకర్షణపత్రములు నాలుగు, కింజల్కములారు కంటె నెక్కువ యుండవు. ఆకర్షణపత్రములకు బాదము గలదు. అండాశయమున రెండుగదులు గలవు.

మన దేశములో బెరుగు నీకుటుంబపుమొక్కలలో నావమొక్కయే ముఖ్యమైనది. వీనిపంట మన రాష్ట్రమున కంటే హిందూస్థానమునందెక్కువకలదు. వరి, చెఱుకు పండు పల్లపు భూములలో నావాలు పెరుగజాలవు. వరికి నావశ్యకమయిన యుష్ణము ఆవాలకు బనికిరాదు. వానిని విడిగా నైనను, గోదుమల పొలములందైనను జల్లెదరు. విడిగా జల్లునపుడు ఎకరమునకు సేరున్నర, రెండు సేరుల విత్తులు గావలయును. పంట బాగున్న యెడల ఆరు మణుగుల వరకు బండును. ఈ మొక్కలకు తెగుళ్ళు పట్టుటయు గలదు. కాని పంట పండిన