Jump to content

పుట:VrukshaSastramu.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

83

కులు చిన్నవి. తమ్మెలుతక్కువ. విషమరేఖ పత్రము. అంచున రంపపు పండ్లున్నవి.

పుష్ప మంజరి
... గెలలు కొమ్మల చివరల నుండి పుట్టును.
పుష్పకోశము
... సయుక్తము. 4. తమ్మెలు నీచము.
దళవలయములు
- ఆకర్షణ పత్రములు 4. అధశ్చిర యండాకారము పాదముకలదు. పచ్చగా నుండును వృంతము నంటియుండును.
కింజల్కములు
... 6 కాడలు, ఆకర్షణ పత్రములకంటే బొడుగుగా నున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
.... అండాశయము ఉచ్చము. రెండు గదులు. గింజల వరుస ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి గలదు. కుడ్యసంయోగము, కీలము గుండ్రముగాను బొట్టిగా నున్నది.

తెల్ల ఆవాల మొక్క 3 మొదలు 5 అడుగులెత్తు పెరుగును. కొమ్మలు గుబురుగా నుండును.

ఆకులు ఒంట్రి చేరిక, లఘు పత్రములు, కొమ్మలనంటి పెట్టుకొని యుండును. క్రింది యాకులు పెద్దవి. తమ్మెలు గలవు. ఇవి ఒక దాని కొకటి ఎదురుగా నుండును. కొన్ని త్రిభుజాకారముగాను కొన్ని గుండ్రముగా నుండును.పై యాకులు బల్లెపాకారము. రెండుప్రక్కల సున్నగా నుండును.

పుష్పమంజరి
.... కొమ్మల చివరలనుండి గెలలు ఉపవృంతములు నున్నగా నున్నవి.

పుష్పకోశము:.... సయుక్తము 4 దంతములు, నీచము.

దళవలయము
.... ఆకర్షణ పత్రములు 4 అధశ్చిర అండాకారము. పాదము గలదు. వృంతము నంటియుండును, పసుపురంగు.
కింజల్కములు
... 4. ఆకర్షణ పత్రములు పాదముల కంటె రెండింతలు పొడుగు.