Jump to content

పుట:VrukshaSastramu.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిప్పతీగె కుటుంబము

తిప్పతీగె.


తిప్పతీగె పలు తావులందు బెరుగుచున్నది. వేరు పెద్దదిగాను మెత్తగాను వుండును.

ప్రకాండము:- తిరిగెడు తీగ (నులితీగలు లేవు) పెద్ద చెట్లమీదప్రాకును. దళసరి బెరుడుకలదు. కొమ్మలనుండి సన్నని వ్రేళ్ళు మర్రి యూడలవలె గ్రిందకు దిగును.

ఆకులు:- ఒంటరిచేరిక. హృదయాకారము లఘుపత్రములు, సమాంచలము, రెండు ప్రక్కలనున్నగానుండును. తొడిమ మొదట కొంచెము లావుగనున్నది.

పుష్పమంజరి:- కొమ్మలు చివర నుండిగాని, కణుపుసందులనుంఛి గాని, గెలలు, కొన్ని కణుపు సందులందు విడివిడిగా కూడ గలవు. ఏక లింగపుష్పములు.