పుట:VrukshaSastramu.djvu/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

492

సిద్ధబీజము లెట్లు పెరుగుచున్నవీ, సిద్ధ బీజాశయము లెట్లు పగులు చున్నవి వానిని సూక్ష్మ దర్శని క్రింద పెట్టి చూచిన గాని సుభోదకము గాదు.

సిద్ధిబీజములు గాలి కెగిరి దూర దూరముగ బడును. పడి తేమగా నున్న యెడల పెరుగుట కారంభించును. ఇవి యొక చోట బడిన చాల కాలమున వరకు అచ్చట మన కేమియు గాన రాదు. ఎదియు మొలచుచున్నట్లు గాన రాదు. కాని అవి యెదుగుచునే యున్నవి. ఒక సిద్ధ బీజమునుండి, తోడిమే ఒక పహము వచ్చుట లేదు. అచ్చటి స్థితిగతులు బాగుగ నున్న యెడల దాని నుండి, అరంగుళము కంటె చిన్నది హృదయాకారముగ నున్న యొకటి పుట్టు చున్నది. ఇది కొంచెమాకు పచ్చగ నున్నది. గాని, దీనికిని నీటి పాచి వలెనే అవయవము లేమియు లేవు; ఆకులు కొమ్మలని ఏమియు లేవు. దాని అడుగున మాత్రము సన్నని వేరుల వంటి కాడలు గలవు. దీనికి పుష్వంకురచ్చదమని పేరు. దీని అడుగున నుండి కొన్ని కణములు పెరిగి, కొన్ని మార్పుల నొందుటచే స్థూల బీజములును, సూక్ష్మ బీజములును గలుగు చున్నవి. సూక్ష్మ బీజములకు మృదు రోమములు గలవు. వీని సాయమున అవి ఈదు లాడుచు స్థూల బీజములవద్దకుపోవును. ఈ సూక్ష్మ బీజము