పుట:VrukshaSastramu.djvu/496

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

493

ల నాకర్షించుటకు స్థూల బీజములపై నున్న కొన్ని కణముల వద్ద నుండి ఒక రసము స్రవించు చున్నది. పిదప నొక స్థూల బీజకణమును ఒక సూక్ష్మ బీజకణమును సంయోగమును బొందును. మగ, ఆడు, భేదమిచ్చటనే గలుగు చున్నది. మగ కణము ఆడు కణములో గలసి పోవు చున్నది. తరువాత అది పెరిగి, పెద్దదై వర్ణగము చున్నది. పై చెప్పిన పర్ణము వంటి మరియొక మొక్క యందు పూర్వాంకురచ్చదనము మిక్కిలి చిన్నదిగానే యున్నది. అది సిద్ధ బీజముల నుండి పైకి వచ్చుట లేదు. స్త్రీ సిద్ధ బీజము నుండి పుట్టిన పూర్వాంకురచ్చ దనము నుండి ఆడు కణములు మగ దానిని నుండి పుట్టిన మగ కణములే బుట్టుచున్నవి.

ఈ రీతిని పర్ణము నుండి పర్ణము పుట్టుటకు మధ్య నొక తర మున్నది. పూర్వాంకు రచ్చదనము నుండి పర్ణముల నుండి సిద్ద బీజములు పుట్టు నపుడు ఆడు పర్ణము, మగ పర్ణము అని భేదమేమియు లేదు. సంయోగమును లేదు. ఈ భేదమును సంయేగమును రెండవ తరము నందె కలుగు చున్నది. ఇట్లు వీనిలో నొక మొక్క జీవితమునందే రెండు తరములు గలుగు చున్నవి.