పుట:VrukshaSastramu.djvu/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

489

సాధారణముగ 12 అడుగుల కైవారముగలమానుగ పెరుగునుకాని, మంచి నేలలైనచో మాను నలుబది ఏబది అడుగుల కైవారమునకు రెండు వందల ఏబది అడుగుల ఎత్తునను పెరుగును. ఈ చెట్లు నాలుగైదు సంవాత్సరముల కొక మారు గింజలు కాచును. వీనికి వర్షమంగ గా అక్కర లేదు. నీల గిరి పర్వతముల మీద రాగిడి నేల యొక్కవగా నుండుట చేతనో, వర్షములెక్కువగా నుండుట చేతనో గాని ఈ చెట్లు పెరుగ లేవు. హిందూ స్థానమునందీ కలప నెక్కువగా వాడెదరు. ఇది చిరకాలము గట్టిగా నుండును. చెక్కడపు పనులకు వీలుగ నుండును. ఈ చెట్ల నుండి కర్పూర తైలము వంటి పదార్థము వచ్చు చున్నది. దీనిని పశువుల రోగములు కుదుర్చుటలో వాడుదురు.

ఇట్టి చెట్లే హిమాలయ పర్వతములమీద మరికొన్ని గలవు. వాని నుండి గుగ్గిలమువంటి పదార్థము వచ్చు చున్నది. దీనికై చెట్టు మూడడుగు లెత్తున మాను చుట్టును కత్తితో నాటు బెట్టుదురు. అందులో ద్రవము చేరి చిక్కబడును. రెండు మూడు దినముల కొక మారు దానిని పోగు చేయు చుందురు. ఈచెట్లను పడ గొట్టిన వెనుక వేరులు దీసి తారు చేయుదురు. దీని ఆకులును కాగితము చేయుటలో బనికి