పుట:VrukshaSastramu.djvu/491

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

488

ప్పొడి తిత్తులోగలవు. రెండును నొక దానిమీదలేవు. మరియు, ఒక కంకి మీద గూడలేవు. కొందరు, ఆచిన్న పొలుసును చేటిక అనియు, పెద్ద రేకును స్త్రీ పత్రమనియు నను చున్నారు. మరి కొందరు చిన్న పొలుసును స్త్రీ పత్రమనియు పెద్ద రేకును మిక్కిలి పెద్దదిగా పెరిగిన యండ లంబ స్తానమనియు అను చున్నారు. అండములు బహిరంగముగనే యున్నవి గాని మిగిలిన అన్ని చెట్లలోను నున్నట్లు అండాశయపు గదులలో నుండి రక్షింప బడుట లేదు. ఇదియే ఈ చెట్ల ముఖలక్షణము. పుప్పొడి యొక్కయు, అండముల యొక్కయు అంతర్భాగనిర్మాణము నందు, సంవృత భీజవంతములకును, వీనికిని భేదము గలదు. గాలికె గిరి వచ్చి పుప్పొడు అండములను చేరు చున్నది. కీలము గాని కీలాగ్రము గాని లేదు. ఆడ కంకులెదిగి యండములు సంయోగమునకు సిద్ధముగా నున్నప్పుడు పెద్ద రేకులు, పుప్పొడి వచ్చి చేరుటకు వీలుగ నుండు నట్లు కొంచము పిప్పారును,. సంయోగానంతర మితర యండమాదిరినే మార్పు చెంది గింజ అగును. ఈ చెట్లు పువ్వుల మూలముననే పెరుగును. కొమ్మల నుండి గాని కొట్టి వేసిన చెట్ల మొండెముల నుండి గాని పెరుగ లేవు.

దేవదారు హిమాలయా పర్వతముల యందు 6000 అడుగులెత్తుగా నున్న ప్రదేశములలో పెరుగు చున్నది. అది