పుట:VrukshaSastramu.djvu/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

479

పతో కూడ పెల్లగించి మూడడుగుల ;అ ముక్కను కోసి పాతిపెట్టుదురు. అది వేళ్ళు బారి మొలక లెత్తగనే వానిని దీసి వేరు వేరుగ పాతెదరు.

వెదురు శీతోష్ణ స్థితులు సమగూడి మొలచు చుండినా మనమంతగ పాటు పడ నక్కర లేకయే పెరుగును. వాని నుండి కాగితములు, నారయు చేయుటకు బనికి వచ్చు పదార్థము మెండుగ వచ్చును. కాని, వాని నుపయోగించుటకు కొన్ని అటంకములు గలవు.

(1)కాగితములు మిక్కిలి అనుకూలముగ నుండు లేత చిగుళ్ళు సంవత్సరము పొడుగున దొరకవు. (2)అట్టి వానిని గోసి వేసితిమా మొక్కలు బాగు పడవు. (3) వెదుళ్ళు విశేషముగ అడవులలోను, అనారోగ్యమగు తావుల యందును పెరుగును. అవి పుష్పించెడు కాలము మిక్కిలి అనారోగ్య మైనది. కావున ఆకాలములో వానిని యంత్ర శాల వద్దకు కొని వచ్చుటకు కూలి వాండ్రు దొరకుట దుర్ఘటము.

(4)వెదుళ్ళ యందున్న బిరుసగు రోమములు పని వాండ్రకు హాని చేయును. ఆ రోమములు తీసి వేయకున్న మంచి కాగితములు రావు.