పుట:VrukshaSastramu.djvu/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

469

దురు. గింజలనుండి చెక్కెరవంటి పదార్థముచేసి దాని నుండి బ్రాందిని చేయు చున్నారు. అట్లు బ్రాంది చేయగా మిగిలిన తుక్కు నుండి రబ్బరు చేయుట ఇటీవల నేర్చుకొనిరి. గింజలనుండి చమురు దీస దానిని సబ్బు మొదలగు నవి చేయుటకు వాడు చున్నారు. కాడలును ఆకులును కాగితములు చేయుటకు పనికి వచ్చును. వీనిని పశువులు తినును గాని ముదిరినచో దినలేవు. మొక్క జొన్నల వర్తకము మన దేశమున కంతగాలేదు.

జొన్నలు కూడ మన దేశములో విశేషముగనే బండుచున్నవి. ఇవి నీరు దొరకక వారికి పనికి రాని మెట్ట నేల లందు పైరు చేయు చున్నారు. జొన్న పంటకు అరిష్టము లును చాల గలవు. మొక్కలు లేఅగా నున్నప్పుడొక విధమగు బూజు ప్రవేసించి మొక్కలను నాశనము చేయును. ఈ ఆపదను పో గొట్టుటకు విత్తనములను కొంచెము సేపు వేడి నీళ్ళలో నైన (మిక్కిలి వేడి నీళ్ళలో చాలపు వుంచిన నవి చచ్చి పెరుగనే పెరుగవు) మైల తుత్తపు నీళ్ళలోనైన నాన బెట్టవలెను. కంకు లీన బోవునపుడు పక్షులు మిడతలు వచ్చి తిని వేయ కుండ కాపాడు చుండ వలెను. ప్రత్యేకముగను ఎప్పుడును జొన్నలనే జల్లుట కంటె కందులు, అనుములు, గోగు మొదలగు వానితో కల్సి గాని ఒక సంవత్సర మవి రెండవ సంవత్సర మివి జల్లిన గాని మంచిది.