పుట:VrukshaSastramu.djvu/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

467

మాసములకు పంటకువచ్చును. గోదుమలకు మన దేశమునందంత వాడుక లేదు. మహారాష్ట్రులు, పంజాబుదేశస్థులు మొదలగు వారు గోదుమ రొట్టెలను దిందురు. చాల కాలము వరకు గోదుమల యెగుమతిలో మన దేశమును పరిగణింప నక్కర లేదను కొనిరి గాని ఇటీవల ఆ అభిప్రాయము మారెను. 1904 సంవత్సరములో ఇంగ్లాండు దేశమునకు ఇతర దేశముల నుండి కంటె మన దేశమునుండియే ఎక్కువ గోదుమలు వెళ్ళెను. కాని తరువాత మన ఎగుమతి తగ్గెను. మనమును గోధుమలను గోధుమ పిండిని కూడ దిగుమతిచేసికొను చున్నాము.

ముక్క జొన్నలు చిరకాలము క్రిందట పోర్చు గీసువారు అమెరికా దేశమునుండి తెచ్చి మన దేశములో నాటిరి. అవి ఇప్పుడెక్కువగానె మన దేశములో సిధ్దమగు చున్నవి. దాదాపు 6012230 ఎకరములు వాని పంట క్రింద నున్నవి. కాని హిందూస్థానము నందేగాని మన రాష్ట్రములో అంత సాగగుట లేదు. సారవంత మగు భూములందు వానిని చల్లినను లాభ మంగగా లేదు. ఈ పైరు వలన ఎకరమునకు నిరువది యైదు రూపాయల లాభమున కంటె ఎక్కువ రాదు. కాని రెండ వంటగ జల్లిన జల్లవచ్చును. వీనిలోను చాల భేదములు గలవు. కొన్ని కొంచెమెర్రగా నుండును, కొన్నింటి గింజలు పెద్దవి, కొన్నిటిలో బంతులు