Jump to content

పుట:VrukshaSastramu.djvu/448

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

444

కాయలనుండి పోక చెక్కలను పలు చోట్ల బలువిధములుగా చేయు చున్నారు. కొందరు కాయలు పూర్తిగ ముదరకమునుపే కోయు చున్నారు గాని మిదిరిన కాయల చెక్కలే మంచివి. కొన్ని చోట్ల కాయలను కోసి, ఎండ బెట్టియే ముక్కలుగా కోసెదరు. మరి కొన్ని చోట్ల వానినుడక బెట్టెదరు. కొందరు ముక్కలు చేసి, ఉడక బెట్టుదురు కాని ఉడక బెట్టని ముదురుకాయలు శ్రేష్ఠము.

రెండవ రకము చెక్కలకు మంచి వానివలె నగపడుటకు కొస బూసెదరు. పెద్ద పెద్ద రాగి డేగిసాలలో పోక కాయలనుడక బెట్టుచు అందులో, సున్నము గాని, తెల్ల మద్ది బెరడు యొక్క బూడిద గాని పోసెదరు. అట్లు రెండు గంటలు క్రాగనిచ్చి చత్రములతో ఆ కాయలను దేవి క్రొత్త కాయల నందులో వైతురు. ఆ కాయలు కూడ నించు మించి రెండు గంటలు ఉడకగానే వానిని దీసి వైతురు. కాగులో మిగిలిన అరసము చిక్కపడి, ఎర్తాగా నగును. దీనిని మరియొక దానిలో పోసి ఎండ బెట్టుదురు. ఇదియే కొస ఇది కవిరి (కాచు) అను కొందురేమో గాని, నిజముగా కాదు. కవిరిని ఒక తుమ్మజాతి చెట్టునుండి చేయుదురు. లవంగ చూరు, చేయుటకు కాయడి