పుట:VrukshaSastramu.djvu/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

445

ప్పతోడనే కత్తిరింతురు. తరుచు మంచిపోకకాయలను లవంగ చూరుచేయుట లేదు.

లేతపోకకాయలు విరేచనకారి. ఎండు కాయలు పొడి గాని, కాల్చిన కాయల పొడిగాని పండ్లకు మంచిది. వీని వాడుక అంతయు తాంబూలములోనే. సదా భోజన మైన పిదప తాంబూలము వేసి కొందుము. అన్నమరుగ జేయు శక్తి కొంచెము దానికి గలదందురు. మరియు తాంబూలమునందు వేసికొను మరి కొన్ని సుగంధ పదార్థములు వీర్య వృద్ధి చేయునందురు. గృహస్తులకు దప్ప మిగిలిన వారలు తాంబూలము వేసికొన కూడదనుటకు నిదియే కారణమై యుండును. ఏదియెట్లున్నను తాంబూలమునకు మిగుల గౌరవము గలదు. అసది నుండియు, మనలను జూడ వచ్చిన వారికి తాంబూలమిచ్చి గౌరవించుట మనకు ఆచార మైయున్నది. మన దేశమునకు క్రొత్తగా వచ్చినపుడు అయిఆరోపియనులుకూడ తాంబూలము తరుచు వేసికొనుచుండెడి వారట.

ఖర్జూరపు చెట్టు మన దేసములో కెల్ల సింధు, గుజరాతు, బండెలుఖండు, పంజాబు రాష్ట్రములో బెరుగుచున్నవి. వీనికి సరియగు శీతోష్టస్థితి కుదురుట కష్టము. పుష్పించుకాలమునందుగాని, కాయలు పండబోవుసపుడు గాని