ఈ పుట ఆమోదించబడ్డది
429
- అండకోశము. అండాశయము ఉచ్చము. 3 గదులు. ఒక్కొక్క దాని యందు నాలుగేసి అండములున్నవి. మధ్యస్తంబ సంయోగము.
- కీలముపొట్టి
- కీలాగ్రము మూడు తమ్మెలు. ఫలము కండ కాయ. రెండు గదులు. పెరుగవు. గింజలు నల్లగా నుండును.
- విషమ కాడ నార
పరకాండము. భూమిలోపల చిటికిన వ్రేలు లావున గాడవలె నుండును. ఆకులు మాత్రము పైకి వచ్చును.
ఆకులు ఒక్కొక చోట నుండి 4 మొదలు 8 వరకు గుత్తివలె వచ్చును. వెలుపలి ఆకులు చిన్నవి. మధ్య నుండునవి సుమారు మూ అడుగుల వరకు పెరుగును. గొట్టము వలె గుండ్రముగా నుండును. వాని మీద తెల్లని చారలు గలవు.
- పుష్ప మంజరి
- ఆకుల మధ్య నుండి కంకి యొకటి రెండంగుళముల వరకు పెరుగు చున్నది. దానిని దట్టమగు నాకు 4, 5 గప్పుచున్నవి. కంకి మీద నొక చోట 4 మొదలు 6 వరకు పుష్పములున్నవి. పువ్వులు పెద్దవి.
పుష్పనిచోళము సంయుక్తము. గరాటి వలె నుండును. 6 తమ్మెలు గలవు. తమ్మెలు సన్నముగా నుండును. నీచము.
- కింజల్కములు 6. గొట్టము అడుగు భాగముతో గలిసి యున్నవి. పుప్పొడి తిత్తులు సన్నముగ సమరోళాకారముగను వున్నవి. వీని రెండు గదులు పై నిడివిగా నుండును.