Jump to content

పుట:VrukshaSastramu.djvu/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

428

పుష్పనిచోళము
సంయుక్తము. 6 తమ్మెలు. తెలుపు రంగు. వాసన గలదు. నీచము.
కింజల్కములు 6 పొట్టిగా నుండును. పుప్పొడి తిత్తులు 2 గదులు.
అండ కోశము. అండాశయము. ఉచ్చము. మూడు గదులు. గింజలు చిన్నవి. కీలము పొట్టిగా నుండును. కీలాగ్రమున మూడు తమ్మెలు.
శత మూలము

శతమూలము మొక్క హిందూ దేశమునంతటను పెరుగు చున్నది. ముల్లంగి వంటి దుపలు గా మారును.

ప్రకాండము
సన్నముగాను, నున్నగాను వుండును. దారువు గలదు. వాడి యగు ముండ్లొక్కొక చోటనొక్కటి గలదు. ముళ్ళ వలె మారియున్నవి. ఆకుల వలె పచ్చాగా నున్నవి. కొమ్మలు పత్రములు లేవు గాన కొమ్మలే వెడల్పై ఆకుల వ్యాపారములు చేయు చున్నవి.
పుష్ప మంజరి. గెల చేటికలు గలవు. పలుచగను హృదయాకరముగను నున్నవి. ఒక్కొక దాని వద్ద నొక్కొక పుష్పము గలదు. పుష్పములు చిన్నవి. తెలుపు రంగు.