Jump to content

పుట:VrukshaSastramu.djvu/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

425

రందురు. కుళ్ళిన ఆవుపేద మంచిబలమునిచ్చునని ఇంకొక కొందరు చెప్పుదురు. బహుశ ఈ ఎరువు లన్నియు ఆయా ప్రదేశములను బట్టి యుండును. కాయగాయు చున్నప్పుడి నీరు విస్థారముగ దగుల చుండవలెను. వీనిపై నీడ విస్తారముగ నుండ రాదు. ఉన్నచో కాయ మిక్కిలి పెద్దిగానగును గాని సువాసన తగ్గి పోవును. పండు పండునపుడు భూమిలో ప్రకాండము చుట్టు కొమ్మలుండును. ఈ కొమ్మలను నాటి యైనను పండులోనుండు నల్లని గింజలగాని పండు పై నుండు ఆకుల కొమ్మ గాని పాతిన మొక్కలు మొలచును. దీని ఆకులనుండి ప్రశస్త మగు నారవచ్చును. కొన్ని దేసములలో ఈ నారతో మిక్కిలి సన్నని బట్టలు నేయు చున్నారు. మరియు ఈ నార దారము మిక్కిలి గట్టిగా నుండుట చే చెప్పులు కుట్టుటకు నుపయోగించు చున్నారు.


పెండలము కుటుంబము.


ఇది యొక మిక్కిలి చిన్న కుటుంబము. దీనిలో నన్నియు గ్తుల్మములే. అవియు తీగెలు. దీనికి కాకర, పొట్ల గెలయందున్నట్లు నులి తీగెలు లేవు. ఆకులు ఒంటరి చేరిక లఘు పత్రములు. సమాంచలము. వీని ఈనెలు, సాధారణ