Jump to content

పుట:VrukshaSastramu.djvu/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

424

దేసనుమని పోయినపుడీ పండ్లు బాగుంటుట చూచి వారి దేశములో వ్యాపింప జేసిరి. తద్వారా ప్రపంచ మంతయు వ్యాపించెను. బ్రెజీలు దేశస్తులీ పండును నానాస్ పందందురు. ఈ పేరును బట్టియే పోర్చు గీసు వాఎరి దీనిని అనానాస్ పండనిరి. ఇదియే మన దేశములో అనాస అనరస, అనానాష మొదలగు పెక్కు పేరుగుల బరగుచున్నచి.

అనాసపండు ఉష్ణ దేశములో మాత్రము పెరుగ గలదు. శీతల దేశములకు కొన్ని దేశముల వారెగుమతి చేయు చుండినను మన దేశశ్తులుపేక్ష చేయు చున్నారు. దీనికి పంట తక్కువయగుట ఒక కారణము. అనాస పండ్లలో, అరటి పండ్లు, మామిడి పండ్లలో వలె పలు రకములు లేవు. ఇప్పటికి రెండు రకములు మాత్రము గాన వచ్చు చున్నవి. ఒక దాని మీది కండ్లు విశాలముగతక్కువగను నున్నవి. రెండవరకు మీది కండ్లు చిన్నవి.

ఈ మొక్కలకు ఇసుకతో గూడిన ఒండ్రు మట్టి నేలలు మంచివి. రాగడి నేలలఓ పెరుగ లేవు. వీనికి దగు ఎరువును కూర్చి పలుపురు పలు విధములాగా చెప్పు చున్నారు. కొందరు వర్షములు కురియక పూర్వము చేప పెంట వేయ వలెనందురు. పెంట విస్తారము వేసిన బాగుగ పెరుగునని8 మరి కొంద