పుట:VrukshaSastramu.djvu/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

417

దీని సువాసనకై తాంబూలమునందు పిండి వంటల యందు వాడు చున్నాము. దీనిని ఔషధములలో కూడ వాడుదురు. రాజులును మిక్కిలి ధనవంతులు దీనితో బొట్టు పెట్టు కొనుదురు. బహుశ దీని బట్టియే సాధరణముగా బొట్టు పెట్టుకొను దానికి కుంకుమ అని పేరు వచ్చి యుండును గాని కుంకుమ పువ్వు దీనియందణు మాత్రము లేదు.


ఒక్కొక్కప్పుడు కుంకుమ పువ్వులో కుసుంబ పువ్వును గలిపి దగాచేయుదురు. కాని కుసుంబపువ్వునకు కూడ మంచి వాసన గలదు.


కిత్తనార కుటుంబము.


కేసరి మొక్క.
ప్రకాండము. భూమిలోపల నుండును. లశునము.
ఆకులు. భూమిలోనున్న లకునము నుండి వచ్చును. తొడిమ లేదు. పత్రములు సన్నముగాను బొడుగుగా నుండును. సమాంచలము. సమ రేఖ పాత్రము రెండు వైపుల నున్నగా నుండును.
పుష్ప మంజరి
ఆకుల మధ్య నుండి ఒకకాడ వచ్చును. ఈ కాడ చివర పుష్పముండును గాని వేరే ఆకులుండవు. పుష్పములు పెద్దవి.