పుట:VrukshaSastramu.djvu/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

416

మనదేశములో ఈ కుటుంబము లోని మిక్కలలో నుపయోగమైనది కుంకుమ పువ్వు మొక్కయె. ఇది చిరకలము నుండి మనదేశమున కలదు. దీనిని ఔషధములో వాడుచున్నారు గాని కొందరంతగా బనిచేయదందురు.

దీని దుంపలను ముక్కలు గోసి వానిని నాటి పైరు చేసెదరు. వీనిని మళ్లో నాటక పూర్వము చేలలో నీరు బోయక ఎండ గట్టుదురు. మొక్కలు పెరిగిన తరువాత అప్పుడప్పుడు నీరు పెట్టుట తప్ప వానికై అంతగా పాటు పడ నక్కరలేదు. ఇది పదునాలుగేండ్ల వరకు బ్రతుకును. వీని పుష్పములు మిక్కిలి అందముగాను పరిమెళముగాను నుండును. వీని నుండియే కుంకుమ పువ్వు చేసెదరు.

పువ్వులను గోసి ఎండ బెట్టి పువ్వులలో నుండు మధ్య కాడలను (కీలములను) త్రుంపి వేరు చేసెదరు. ఇదియే మేలైన కుంకుమ పువ్వు. దీని వెల తులము రూపాయిన్నర... రెండు రూపాయలవరకు వుండును. ఈ కాడలపై నున్న తలలు వీని కంటె కొంచెము తక్కువరకము తరువాత పువ్వులను చిన్న కర్రతో గొట్టి నీళ్ళలో వేసెదరు. రేకులు పైకి తేలును. అడుగునకు దిగు వానిని పోగు చేసి మరల బాది నీళ్ళలో వేయుదురు. ఈ ప్రకారము మూడు మాట్లు చేయుదురు గాని అంతకంతకు తక్కువ రకము వచ్చును.