పుట:VrukshaSastramu.djvu/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

414

చంద్ర మూలికను కూడ ఔషధములలో వాడు చున్నారు. దీని వేరునకు సువాసస్న గలదు. దీని కీలాగ్రము గరాటి వలె నున్నది.

కొండ పసుపు ఉల్లి గడ్డల వలె గడ్డలుగా నుండును.

కస్తూరి పసుపు పసుపు వలెనే యుండును గాని మంచి వాసన గలదు

అడవి యేలక కాయలు. ఏలక కాయలకు బదులుగా వీని నుపయోగించుట కలదు కాని ఇవి అంత రుచిగా నుండవు.


కుంకుమపువ్వు కుటుంబము.


ఈ కుటుంబము మొక్కలు శీతల దేసములో గాని పెరుగ లేవు. ఇవి మనదేశములో అంతగా లేవు. వీనిలోనన్నియు గుల్మములే గాని పెద్ద చెటేలు లేవు. పుష్ప నిచోళములో ఆరురేకులుండును. కింజల్కములు మూడును పుష్స్ప నిచోళ ములైనను అండాశయము నైనను అంటి యుండును. అండాశయము ఉచ్చము. మూడు గదులు గలవు. కీలము ఒకటి కీలాగ్రములు మూడు.