పుట:VrukshaSastramu.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25

కొమ్మల చివరల నుండి బయలు దేరును; ఒక కొమ్మ చిట్టచివర ఆకులను వేయుట మాని వేసి, పువ్వులనే బూయును. ఇట్లు ఆకులు వేసెడు కొమ్మలఏ పువ్వులు బూయుట చేతను, సాధారణముగ కొమ్మలు పుట్టెడు కణుపు సందులలో పువ్వులు పుట్టు చుండుట చేతను పువ్వుల కాడలను కొమ్మలేయని యూహింప వలసి యున్నది. ఈ కాడ కొమ్మ యొక్క మార్పు చెందిన రూప మైనపుడు, పువ్వుల రేకులును ఆకుల మారు రూపాలు గావలసి యున్నవి. ఇవి యట్లగుట జీవ శాస్త్రము నందిదివరకే మీరు చదివి యున్నారు. పువ్వుల కాడ మీద రేకులు ఆకుల వలె ఒంటరి చేరిక గను, అభిముఖ చేరిక గను నుండక అన్నియు నిల కణుపు వద్దనే నున్నవి. రేకులును కాడలు పుట్టెడు కణుపులు నొక దాని తోడ నొకటి కలియు చున్నవి. ఆందులవలెనే పుష్ప భాగములు కూడ కణుపుల వద్దనే పుట్టును.

తురాయి, ఆవిశ పువ్వులొక్కొక్క కాడ మీద పెరుగు చున్నవి. పువ్వులకును తొడిమలు గలవు. మధ్యనున్న పెద్ద కాడను వృంతమనియు ఈ తొడిమలను ఉప వృంతములనియు చెప్పుదుము. ఒక్కొక్క పువ్వే యున్న యెడల దానికాడనే వృంతమందుము. ఇట్లు వృంతములు, ఉప వృంతములు నుండి దిగువ నుండి పువ్వులు పూయుచు, వృంతము చివర నింకను మొగ్గలు పుట్టు చున్న యెడల ఆపుష్పములు సముదాయమును గెల అందుము. అట్లు పూచు పద్ధతిని మధ్యాభిసరణ మందుము.