పుట:VrukshaSastramu.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

మెట్టతామర, కొబ్బరి మొదలగు ఆకులలో ఈనెలు కొన వరకును గలియకుండనే బోవు చున్నవి. అవి సమ రేఖ పత్రములు. ప్రత్తి, గంగరావి ఆకులలో ఈనెలు తాళ పత్ర వైఖరిగ నున్నవి. అరటి యాకు వలె కొన్ని నున్నగా నుండును. మర్రి ఆకులవలె కొన్ని దట్టముగా నుండును. కొన్ని ఆకులు మీద మెత్తనివో బిరుసువో రోమమములు గలిగి వున్నవి.

బొమ్మ
(సమరేఖ పత్రము)
సమరేఖ పత్రము
పుష్పములు

మొలచుచున్న ప్రతి మొక్కయు పువ్వులను పూసి, కాయలను గాసి తన జన్మమును సార్థకము చేసికొన జూచు చున్నది. వాని సంతాన వృద్ధికి కారణమగు భాగము లీ పుష్పములే. పువ్వులు ఒక్కొక్కటి విడివిడిగా నైనను, ఒక కాడ మీద తురాయి మామిడి కొబ్బరి పువ్వులవలె కలిసి యైన వుండును. కొన్నిటిలో పువ్వులు కణుపు సందుల నుండి బయలు దేరును. కొన్నిటిలో గన్నేరు మొక్కలో వల్లె