ఈ పుట ఆమోదించబడ్డది
378
- పుష్పకోశము
- - రక్షకపత్రములు 6. నీచము
- దళవలయము
- - లేదు
- కింజల్కములు. 3 కాడలు కలసి ఒకటిగా నేర్పడియున్నవి.
- స్త్రీ పుష్పము.
- పుష్పకోశము
- - రక్షకపత్రములు. 6 నీచము
- దళవలయము
- - లేదు
- అడకోశము
- - అండాసయము ఉచ్చము. 3 గదులు రెండేసి గింజలు ఫలము బహు విదారణ ఫలము. కీలము 3 చీలికలు.
- కొండాముదము
కొండాముదము 3- 6 అడుగుల వకరు పెరుగును. కొమ్మలు గుండ్రము. లేగొమ్మలమీద మెత్తని యొకవిధమగు పొడి గలదు.
- ఆకులు.- ఒంటరి చేరిక. కణుపు పుచ్చములు లేవు. అండాకారము. లఘు పత్రము. కొన్నిటికి తమ్మెలుండును. 3 పెద్ద ఈనెలు గలవు. కొద్దిగరోమములున్నవి. అంచున నిడుపాటి రంపపు పండ్లు గలవు.
- పుష్పమంజరి. కణుపు సందులందుండి యొక గెల.
- పురుష పుష్పము.
- పుష్ప కోశము.- రక్షక్ పత్రములు. 5. నీచము.
- దళవలయము
- - లేదు.
- కింజల్కములు.- అసంఖ్యములు. విడివిడిగా నుండును. వీని చుట్టును