పుట:VrukshaSastramu.djvu/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

377

కింజల్కములు, అసంఖ్యములు, కాడలు శాఖోపశాకలు నున్నవి. పుప్పొడి తిత్తులు గుండ్రము.
అండకోశము
లేదు;
స్త్రీ పుష్పము

పుష్పకోశము త్వరగా రాలి పోవును. నీచము. సంయుక్తము.

దళ వలయము
- లేదు.
కింజల్కములు :- లేవు.
అండ కోశము
- అండకోశము ఉచ్చము. 3 దగులు. కీలములు 3 ఒక్కొక చీలిక కొన భాగమందు రెండుగా చీలి యున్నది. ఒక్కొక గదిలో నొక్కక గింజ. అది గది కప్పు ఒక్క లోపల మూలను అలరించి యున్నది. కాయ బహు విదారులు ఫలము. గింజ పొర మిక్కిలి గట్టిగా నుండును. విత్తనములకు బీజ పుచ్చము. గలదు. విత్తనములో అంకురచ్చదనము గలదు.
నేల యుసిరి
- నేలయుసిరి తోటలలో బెరుగు చిన్నమొక్క. గుల్మము. 1 - 2 అడుగుల యెట్టు పెరుగును. ప్రకాండము గుండ్రము గాను నున్నగాను నుండును.
ఆకులు.- ఒంటరి చేరిక, లఘు పత్రము. చిన్నది. తొడిమ లేదు. సమ గోళాకారము. సమాంచలము. విషమరేఖ పత్రము. నున్నగానుండును. కొన గుండ్రము.
పుష్ప మంజరి
- కణుపు సందులందు ఒకటో, రెండో పురుష పుష్పములు, ఒకస్త్రీ పుషము కలదు.
పురుష పుష్పములు.