Jump to content

పుట:VrukshaSastramu.djvu/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

372

యుంచినను) నరుకక యుంచినను నన్ని చెట్ల యందునగరు లభించదు. కొన్ని చెట్ల యందు మాత్రము మాను లోను కొమ్మల యందును ముక్క ముక్కలవలె నగరేర్పడును. ఈ కారణము వల్ల నిట్లేర్పడు చున్నదో తెలియ వచ్చుట లేదు. మరియు నేచెట్టు నందేర్పడినది నరికిన గాని తెలియదు. అగరులే చిట్లంత ఉపయోగ కారులు కావు. కలపకును సువాసనయుండక తేలిగ గానుండును. అగరు నకు మంచి పరిమళము గలల్దు. పన్నీరు వలే దీనిని శుభ కార్యములందు ఉపయోగించురు. దీని తోడనే అగరు వత్తులను చేయుదురు. కాని ఇతర పరిమళ ద్రవ్యములతో కూడ వత్తులుచేసే వానినే అగరు వత్తులని అమ్ముచున్నారు. సాధారణముగా అంగళ్ళ యందుండు అగరు నూనెయు నిజముగా అగరు నుండి చేసినదేయని నమ్ముటకు వీలు లేదు, అగరును కొందరు ఔషథముల యందు కూడ ఉపయోగించు చున్నారు.

కాగితములు చేయక పూర్వము అగరు బెరడులను బలుచగ చీల్చి వానిమీద గొందరు వ్రాసెడు వారు. కాగితములు వచ్చినగొంత కాలము వరకు కూడ మంత్రవేత్తలగు బ్రాహ్మణులు యోగులును యంత్రశాలలందు