ఈ పుట ఆమోదించబడ్డది
354
ముళ్ళతోటకూర వర్షాకాలములో విశేషముగ పెరుగును. దీనికి ఆదుల వద్ద ముండ్లు గలవు.
కొయ్యతోట కూర కొంచెమించు మించు చిలక తోట కూర వలె నుండును. ఈ మొక్కలు దాని కంటె కొంచెము చిన్నవి. దీనిని కూర వండు కొందురు.
పొన్నగంటికూర ఆకులొక్కొకచో రెండు రెండున్నవి. దీనిని కూడ కూర వండు కుందురు. ఆకుల నెండ బెట్టి వరుగు చేసి నిలువ కూడ చేసి కొందురు.
దుగ్గల కూర మంచి నేలలందు అడుగెత్తు పెరుగును. ఆకులు చతురము వలె నుండును. కాయ కంటె పుష్పకోశము పొడవు.
చిరకూర చిన్నమొక్క. కొమ్మలు నేల మీద ప్రాకు చుండును. మగ పుష్పములు చాల గలవు. దీనిని కూడ కొందరు తిందురు గాని ఎచ్చటను సేద్యము చేయుట లేదు.
కోడిజుట్టుమొక్క కంకి మిక్కిలి అందముగానుండుటచే పెంచు చున్నారు. వీనిలో కొన్నిపచ్చగానుండును.
చంచలి మొక్క ఆకులు బల్లెపాకారము. పువ్వులెర్రగా నుండును. లేతాకులు కూర వండుకొందురు.