పుట:VrukshaSastramu.djvu/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

330

నువ్వులను బ్రాహ్మణకార్యములందు వాడుదురు.

పెద్దపల్లేరు ఇసుక నేలలో పెరుగును. దీని వేరు నారింజ రంగుగా నుండును ఈ మొక్క ఆరంగుళములు మొదలు రెండడుగు లెత్తు వరకు పెరుగును. ఆకులు అండాకారము, పువ్వులు పచ్చగా నుండును. దీని ఆకులను రొట్తను వేడి నీళ్ళలో నైనను, పాలలోననను వేసి కలియ బెట్టు చున్న యెడల నవి చిక్క బడును, గొల్లలు పెరుగులో నీళ్ళు బోసి గట్టిగా నుండుటకు దీని నుపయోగింతురట.

బగ్గపట్టి మొక్క చెరువు గట్లమీద నొకటి రెండడులు ఎత్తు మొలచును. వర్ష కాలములోను శీతా కాలములోనుల్నీలపు రంగు పువ్వులను బూసి అందముగా అగుపించును. వుప్పులకు సువాసన గలదు.


అడ్డసరపు కుటుంబము.


అడ్డసరముచెట్టు హిందూ డేసమునం దెల్లయెడలను పెరుగు చున్నది. దీనిని తరుచుగా తోటలయందు దొడ్లలోను పెంచుదురు.

ఇది గుబురు చెట్తు సాధారణస్ముగా 4....8 అడుగుల వరకు పెరుగును గాని అప్పుడప్పుడు 20 అడుగుల వరకు కూడ పెరుగును. బెరడు నున్నగాను బూడిదవర్ణస్ముగాను నుండును.