329
డ్రుమట్తి నేలయు, విస్తారము నీరును కావలయును. నూవు పంట భూసారమును లాగి వేయును గనుక సాధారణ భూములందు వేయరు. వీనిని ప్రత్యేకముగా నైనను ప్రత్తి మొదలగు వానితో గలిపి యైన పండింతురు. కొన్ని చోట్ల తెల్లని నువ్వులు కూడ కలవు. చెన్న రాజ్యమందు నూవు పంట గోదావరి విశాఖ పట్టణము, సేలము, కోయంబత్తూరు, ఉత్తరార్కాటు జిల్లాలో మాత్రము గలదు. నూవు పైరు చల్లిన మూడు మాసములకే పంటకు వచ్చును.
నువ్వుల నూనెను మనము విస్తారముగా వాడుచున్నాము. నువ్వులనే గానుగాడి నూనె తీయుచున్నారు గాని నూవు పప్పునూనె మంచిది. వేరు శనగ నూనె యంతకంటె చౌకగుటచే దీనిని మంచి నూనెలో కలుపు చున్నారు. సువాసన నూనెలకును నువ్వుల నూనేనె ఉపయోగించు చున్నారు. ఒక వరుస మల్లి పువ్వులను, దానిపైన నువ్వులను, వీనిపైన మల్లిపువ్వులను ఈ రీతిని పేర్చి మూత వేసి ఒక పూట యుంచినచో మల్లి వాసన నువ్వులకు పట్టును. ఈ నువ్వుల నూనెకును మల్లి పువ్వులవాసన యుండును. ఈ రీతినే కొన్ని చోట్ల చేయు చున్నారు.
నువ్వులపైరు వలన మన దేశమునకు లాభము గలుగు చున్నది. ఇంగ్లాండు ప్రాన్సు జర్మని మొదలగు దేశములకు చాల వరకు నెగుమతి చేయుచున్నాము.