ఈ పుట ఆమోదించబడ్డది
326
- పుష్పకోశము
- - సంయుక్తము గొట్టమువలె నుండును. కొంచెమోష్టాకారము ఒక్కొక్కప్పుడు 4 దంతములుండును. నీచము.
- దళ వలయము
- - సంయుక్తము బిళ్ళ గన్నేరు పువ్వుల వలె అడుగున పొడుగు గొట్టము వలెను, పైన 5 తమ్మెలు వ్యాపించి యు నుండును.
- కింజల్కములు
- - 2 పొట్టివి దళవలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము రెండు గదులు. అండములు చాల యున్నవి. కీలముపొడుగు కీలాగ్రము రెండు చీలికలు.
ఈ కుటుంబములో ఎక్కువగ తీగెలును, చెట్లును గలవు. వీని ఆకులు అభిముఖ చేరిక, కొన్నిటివి మాత్రము లఘు పత్రములు. పుష్పములు అసరాళము. కింజల్కములు దళ వలయపు తమ్మెలుకకంటె తక్కువగానుండును. అండాశస్యము రెండు గదులు, చాల గింజలుండును. గింఅలకు సాధారణముగ రెక్కలు గలవు. కాయ యెండి పగులును. ఈ కుటుంబములో ఉపయోగించు మొక్కలంతగా వున్నట్లు గాన వచ్చుట లేదు.
ముక్కడిచెట్టు కలప బూడిఒదవర్ణముగను గట్టిగానునుండును. అదిత్వరగా వంగి పోదు. కావున సాలివాండ్రు మగ్గములకు దానినుపయోగింతురు. ఈ కలప ఇతర పనులకు కూడ పనికి వచ్చును.