పుట:VrukshaSastramu.djvu/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

325

ఆకులు
- అభిముఖచేరిక, మిశ్రమ పత్రములు మిషమ పక్ష వైఖరి. చిట్టి ఆకులు 4 జగలు. వీని తొడిమ పొట్టిది. అండాకారము విషమ రేఖ పత్రములేతాకుల కడుగున మెత్తనిరోమములు గలవు. సమాంచలము, కొన్నిటి యందు కొంచెము గొగ్గి గొగ్గులుగ నుండును. కొన సన్నము.
పుష్ప మంజరి
- కొమ్మలచివరలనుండి రెమ్మగెలలు వృంతము మీదను ఉప వృంతము మీదను గోధుమ వర్ణము గల రోమములు గలవు. పుష్పములు పెద్దవి. అసరాళము చేటికలు చిన్నవి గలవు.
పుష్పకోశము
- సంయుక్తము 5 దంతములు. నీచము.
దళస్వలయము
.... సంయుక్తము 5 తమ్మెలు అసరాళము పశుపు రంగు మంచి వాసన వేయును.
కింజల్కములు
- 4 కాడలు పొడుగు మరియొక గొడ్డు కాడ గలదు. దీనికి పుప్పొడి తిత్తి లేదు పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండకోశము
- అండాశయము ఉచ్చము రెండు గదులు అండములు చాల గలవు. గింజలకు రెక్కలుండును. కీలమగుండ్రము కీలాగ్రము రెండు చీలికలు.

ముక్కడి చుట్టు కూడ కొండ ప్రదేశములే బాగుగ బెరుగును.

ఆకులు
- అభి ముఖ చేరిక, మిశ్రమ పత్రములు పక్ష వైఖరి. చిట్టిఆకులు హృదయాకారము అడుగున నున్న జాత పెద్దవి. విష మ రేఖ పత్రము సమాంచలము కొన సన్నము.
పుష్ప మంజరి
- కొమ్మలచివరల నుండి, త్రివృంత మధ్యారంభ మంజరులు, చేతికలు గలవు. పువ్వులు చిన్నవి. తెలుపు రంగు మంచి వాసన వేయును.