పుట:VrukshaSastramu.djvu/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

321

రసస్గడ్డిమాను కొండల మీద పెరుగు చున్న చెట్టు. తొడిమ చిన్నది. ఆకులు పెద్దవి. తెల్లని పువ్వులు పూయును.

నేలములగ నేల మీద ప్రాకును. కాయగుండ్రముగను నున్నగను నుండును. దీనిని వండికొని తిందురు. ఉస్తి మొక్క నేలమీద ప్రాకు చుండును. ఆకుల మీదను హాయల మీదను ముండ్లు కలవు.


నాచు కుటుంబము.


నాచు అను పేరును నీళ్ళమీద తేలు చుండు ప్రతి మొక్కకును, ఒక్కొక్కప్పుడు పాకుడునకు కూడ వాడుచున్నాము. గాని ఆ మొక్కలన్నియు వేరు వేరు కుటుంబములలోనివే. కొన్ని నాచు లకు పువ్వులుండ నేయుండవు. ఇచ్చట వర్ణించిన నాచు పువ్వులు పూచునదియె.

నిలకడగా నున్న నీళ్ళలో కొన్ని మొక్కలు తేలుచుండుట జూతుము. మొక్కల ఆకులు నీళ్ళస్లోనె యున్నవి. ఈ మొక్కలకు వేళ్ళు లేవు. ఆకులు మిక్కిలి సన్న సన్నముగ చీలి యున్నవి. వాని వద్ద మిరియపు గింజలంతంత సంచుల వంటివి చూడ నగును. వీని మూలముననే మొక్క తేలు చున్నది. దాని పువ్వుల కాడ నీటిపైకి వచ్చుటకై యది తేలుచున్నది. పువ్వులు కూడ నీళ్ళలోనె యున్న ఎడల నొక పువ్వు వద్దనుండి మరియొక పువ్వులోనికి, పుప్పొడి వచ్చి చేరుటకు వీలుండదు గావున పువ్వులు పైకి రావలసి యున్నది. ఈ మె