Jump to content

పుట:VrukshaSastramu.djvu/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

312

కమిదన పుష్పమును రెండవానిమీద పురుష పుష్పమును వుండును. పువ్వులు నీలపు రంగు.

పుష్పకోశము
సంయుక్తము. 5 తమ్మెలు బల్లెపాకారము నీచము. కాయతోగూడ బెద్దదగును.
దళవలయము
- సంయుక్తము అయిదు రెమ్మలు నీలపు రంగు.
కింజల్కములు
- 5 కాడలు పొట్టి దళవలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులకు చివర రంద్రములేర్పడి వాని ద్వార పుప్పొడి బైటకు వచ్చును.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. కీలము పొడుగు ఫలము కండ కాయ.

ఈ కుటుంబములో గుల్మములు, గుబురు చెట్లు, చిన్న చెట్లును గలవు. ఆకులు వంటరి చేరిక. వృంతము యొద్ద అభి ముఖ చేరికలగ నుండిన నుండవచ్చును. పుష్పములు ఒంటరిగా నైనను మధ్యారంభ మంజరులుగా నైన నుండును. కొన్ని మొక్కల పుష్పములు మాత్రము అసరాళము. పుష్ప కోశము, 5 దళ వలయము. 5 సంయుక్తము, కింజల్కములు 5, దళ వలయము నంటి యుండును. అండ కోశము, ఉచ్చము అండాశయము సరాళముగ నుండక కొంచెము వంకరగ వుండును. 2 గదులు కొన్నిటిలో నింక నెక్కువ యుండును. కీలాగ్రములు 2 ఫలము కండ కాయ.