పుట:VrukshaSastramu.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17

మనియు, ఇంక నెక్కువ సారులు విభజించి యున్న యెడల ల్బహు భిన్న పత్రమనియు నందుము. మిశ్రమ పత్రములందున్న చిన్న చిన యాకులను చిట్టి యాకులందుము. వేపాకులో చిట్టి యాకులు జతలు జతలుగా నుండి చివరి కొకటి గలదు;

బొమ్మ
( వేపాకు)....... ((తురాయి ఆకు)
తురాయిఆకు

ఆకుల సంఖ్య బేసి. తురాయి ఆకులో అన్నియు జతలు జతలుగానే యున్నవి. ఆకుల సంఖ్యసరి. కావున తురాయి ఆకును సమభిన్నపత్ర మనియు, వేపాకును విషమ భిన్న పత్ర మనియు చెప్పుదుము. వేపాకు, చింతాకు, తురాయి ఆకులలో చిట్టి యాకులు మధ్యనున్న కాడకు రెండు ప్రక్కల పక్షి రెక్కల మీదనున్న ఈకల వలె నుండుటచే అ ఆకును పక్షవైఖిరినున్న దందుము.