పుట:VrukshaSastramu.djvu/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

జటతీగె కూడ డొంకల మీద పెరుగును. ఆకులపై వత్తుగ రోమములు గలవు. దీని పువ్వులు మంచి వాసన వేయును.


ముషిణి కుటుంబము.


ఈ కుటుంబములో పెద్ద చెట్లు, గుబురు మొక్కలు, గుల్మములును కూడ కలవు. ఆకులు లఘు పత్రములు. ఒంటరి చేరిక. కొన్నింటికి సన్నని కణుపు పుచ్చములున్నవి. కణుపు సందులనుండి యైన కొమ్మల చివరల నుండి యైన మధ్యారంభ మంజరులు వచ్చును. పువ్వులు సరాళములు, పుష్ప కోశమునకు నాలుగైదు దంతము లుండును. నీచము దళ వలయము నకు నాలుగైదు దంతములుండును. నీచము. దళవలయమునకు నన్నియే తమ్మెలుండును. కింజల్కములు దళ వలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు అండాశయము ఉచ్చము. రెండు గదులు, కీళము కొన్నిటిలో రెండు చీలి యున్నది.

ముషిణి చెట్టు చిన్న చెట్టు. ఆకులు అండాకారము పువ్వులు చిన్నవి. కొంచమాకు పచ్చగను తెల్లగను నుండును. దీని గింజల వ్యాపార మీమధ్యనే కొంచెము తగ్గెను. పండ్లను గోసి, గింజలను కడిగి ఎండ బెట్టుదురు. ఈ గింజ్లనుండి కొన్ని ద్రవములను తీయు చున్నారు. వీనితో బట్టలకు దోపు