పుట:VrukshaSastramu.djvu/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

303

కాకిపాల తీగ
- ఇసుక నేలలందు బాగుగ పెరుగును. కొమ్మల చివరల నున్న ఆకులు చిన్నవి. ఆకుల అడుగుపైపున రోమములు గలవు. వీనితో జిగట విరేచనములకు మందు చేయుదురు. వేరు బెరడు నరుగ దీసి ఇచ్చిన డోకులు వచ్చును.
పూలపాల తీగె
- వర్షాకాలములో పుష్పించును. దీని ఆకులు కూడ చాల దట్టముగనుండును.
దొడ్డి పాల తీగె పెద్దది
- వర్షాకాలములో పుష్పించును. దీని ఆకులు కూడ చాల దట్టముగ నుండును.
దొడ్డిపాలతీగె పెద్దది
- దీని ప్రకాండము లావుగ నుండును. పువ్వులాకు పచ్చగ నుండును.
పాలగర్జి తీగె
- కొండ ప్రదేశములలో మొలచును. అకులు రెండు వైపుల రోమములు గలవు. ఈనెలు ఎరుపు. పువ్వులు ఎరుపు. తెలుపు, ఆకు పసుపు గలిసి యుండును.
పాల సిఖండి
- పలు చోట్ల పెరుగును. లేత కొమ్మల మీద ఆకులు సన్నముగాను ముదురు వాని మీద వెడల్పుగాను వుండును. వేళ్ళు బెరడు పొడుము చేసి వెన్నతో నిచ్చిన ఉబ్బసపు దగ్గులు తగ్గు నందురు.
చిరుపాల తీగె
- కాలువల గట్లమీద పెరుగును. దీనిఆకులు పెద్దవి. పువ్వులు కొంచెము తెల్లగాను గులాబి రంగుగను అందముగా వుండును.