Jump to content

పుట:VrukshaSastramu.djvu/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

287

పుష్ప కోశము
- సంయుక్తము. గిన్నెవలెనుండు అంచున చాల సన్నము తమ్మెలు అయిదు మొదలు తొమ్మిది వరకు వుండును. ఆకు పచ్చని రంగు నీచము.
దళ వలయము
- సంయుక్తము. చత్రాకారము, అడుగున గొట్టము వలె నుండి చివర పెద్ద తమ్మెలుండును. తెలుపు.
కింజల్కములు
- రెండు. కాడలులేవు. పుప్పొడి తిత్తులు మాత్రము దళవలయము నంటి కొని రెండు గలవు. అవి దళ వలయపు తమ్మెలును గొట్టమును గలియుచోటనున్నవి. రెండేసి గదులు.
అండ కోశము
- అండాశయము ఉచ్చము రెండు గదులు కీలము లావుగ నుండును.
ఫలము
- రెండు కండకాయలు కాయును.

సాధారణముగ మన దొడ్లలో పెరుగు వానిని కొమ్మలు నాటి పెంచుచు వచ్చుట వలన వానికి కాయలు గాయు శక్తి తగ్గి పోయినది.

చిన్న చెట్లును చిగురుమొక్కలు నీకుటుబమున గలవు. కొన్ని తీగెల వలె నెగ బ్రాకును. కాని వానికి నులి తీగెలు గాని, ముళ్ళు గాని యుండవు. ఆకులు లఘు పత్రములు గను మిశ్రమ పత్రములు గను కూడ వున్నవి. వీనికి గణుపు పుచ్చములుండవు. పుష్ప మంజరులు సాధార్ణముగ త్రివృంత మధ్యారంభ మంజరులు మిధున పుష్పములు ఏక లింగ పుష్పములును గలవు. పోతు మొక్కలు ఆడు మొక్కలు కొన్నిటిలో వున్నవి. పుష్ప కోశము దళవలయము సంయుక్తము.