ఈ పుట ఆమోదించబడ్డది
286
గదులుండును. కొన్నిటిలో మాత్రము ఒక గదియే కలదు. అండములు ఒకటియో రెండో వ్రేలాడు చుండును. ఫలములో పెంకు కాయ.
లోధ్ర చెట్టు హిందూస్తానములో ఉన్నతప్రదేశముల మీదను హిమాలయా పర్వతేముల మీదను పెరుగు చున్నది. పువ్వులలో కింజల్కములు చాల గలవు. దీనిబెరడును, ఆకులును ఎర్రని రంగు చేయుటలో ఉపయోగించెదరు. చినాలి రంగువంటి రంగు వచ్చును. కాని తరుచుగ రంగు వచ్చెడు తొగరు చెట్టు వంటి ఇతర పదార్థములతో గలిపి వాడుదురు. దీని బెరడును ఔషధములలో గూడ వాడుదురు.
మల్లి కుటుంబము.
మల్లితీగె పందిళ్ళ మీదను చెట్ల మీదను ప్రాకును గాని దానికి నులి తీగెలుండవు. కొమ్మలను చిక్కుడు తీగ వలె చుట్టుకొనును.
- ఆకులు
- - అభిముఖచేరిక. లఘు పత్రములు. కురుచ తొడిమ. అండాకారము. సమాంచలము. విషమరేఖపత్రము. కొనగుండ్రము. రెండు వైపుల నున్నగా నుండును.
- పుష్పమంజరి.
- - కొమ్మల చివరల నుండి గుత్తులు పువ్వులు తెలుపు.అంతరాళము. మంచివాసనవేయును.