పుట:VrukshaSastramu.djvu/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

249

అవ్వగూద తీగెమీద ఆకులు దూరము దూరముగా నుండును. పువ్వులు గెలలు తెలుపు రంగు. కాయ గుండ్రముగాను నారింజ రంగు గాను నుండును. ఇది మిక్కిలి చేదు. దీనిని ఔషధములలో వాడుదురు.

కొత్తిమెరి కుటుంబము.

కొత్తమెరి మొక్క చాల చోట్లనే పెరుగు చున్నది. ప్రకాండము. గుల్మము. ఏక వార్షికము.

ఆకులు
- ఒంటరిచేరిక. పత్రములు చీలి యుండును. కొన్ని లఘు పత్రములు. తొడిమ ప్రకాండము నావరించి యున్నది. సువాసన గలదు. రెండు వైపుల నున్నగా నుండును.
పుష్ప మంజరి
- గుత్తి. వృంతముక్రింద చేటికన్నియు గలిసి గిన్నె వలె ఏర్పడు చున్నవి. పువ్వులు చిన్నవి. ఉపవృంతముల వద్దను చేటికలు కలవు.
పుష్ప కోశము
- సంయుక్తము: 5 దంతములున్నవి. అండాశయము అంటుకొని యుండును. ఉచ్చము.
దళ వలయము
- అసంయుక్తము: 5 ఆకర్షణ పత్రములు అండాశయము నంటి యుండును. ఇవి మొగ్గలో అల్లుకొని యున్నవి.
కింజల్కములు
- 5. కాడలు చిన్నవి. ఇవియు అండాశయము నంటి యున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.