పుట:VrukshaSastramu.djvu/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

పురుష పుష్పము.

పుష్పకోశము
- సంయుక్తము. 5 దంతములు గలవు. ఆకు పచ్చ రంగు.
దళవలయము
- సంయుక్తము 5 చిన్న తమ్మెలు గలవు. పసుపు రంగు పుష్ప కోశము నంటి యుండును.
కింజల్కములు
- 3 రెండింటి పుప్పొడి తిత్తులు రెండేసి గదులు ఒక దాని దొక గదియె పుప్పొడి తిత్తులు మెకలు తిరుగవు.

స్త్రీ పుష్పము. పుష్ప కోశము, దళవలయము:..... పై వాని వలెనే యుండును.

అండకోశము
- అండాశయము నీచము అండములు చాలనుండవు. కుడ్య సంయోగము కీలము లావుగా నుండును. కీలాగ్రము గుండ్రము.

ఈకుటుంబము మొక్క లెక్కువగా ఉష్ణప్రదేశములలో పెరుగు చున్నవి. ఇవన్నియు దీగెలే. వానికి నులి తీగెలు గలవు. కొన్నిటి నులి తీగెలు, చీలి యుండును. ఆకులు, లఘు పత్రములు,. ఒంటరి చేరిక, అకుల మీదను, తీగెలమీదను కూడ రోమములు గలవు. పువ్వులు తెల్లగానైనను, పచ్చగా నైనను వుండును. ఏకలింగ పుష్పములు. కొన్ని తెగలలో మగ తీగెలు ఆడు తీగెలు గలవు. కింజల్కములు మూడు లేక ఒక తీగ తీగెయందు నైదు కింజల్కములును ఒక్కొక్క దాని పుప్పొడి తిత్తియందు నొక గదియు నుండుట చేత, నట్టి కింజల్క