పుట:VrukshaSastramu.djvu/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

241

పురుష పుష్పము
.....
పుష్పకోశము
- సంయుక్తము 5 తమ్మెలు తమ్మెలు బల్లెపాకారము.
దళ వలయము
- సంయుక్తము అడుగు వరకు నైదు తమ్మెలుగ జీలి యున్నది. తెలుపు.
కింజల్కములు
- 3 రెండిటి పుప్పొడి తిత్తులు రెండేసి గదులు. ఒక దాని దొకగదియె. పుప్పొడి తిత్తులు మెలికలు తిరిగి యుండును.
స్త్రీ పుష్పము

పుష్పకోశము:, దళ వలయము: పైదాని వలెనె యుండును.

అండ కోశము:- అండాశయము నీచము. 1. గది కీలము సన్నము. అండ లంబన స్థానములు 8. కుడ్యసంయోగము.

పొట్టి బుడమ

పొట్టి బుడమ తీగెచాల చోట్ల పెరుగును. తీగె సన్నముగా నుండును. నులి తీగెలు చీలియుండవు.

ఆకులు
- ఒంటరి చేరిక లఘు పత్రములు. హృదయాకారము 5 తమ్మెలు గలవు గాని చిన్నవి. విషమ రేఖ పత్రము. అంచున రంపపు పండ్లుగలవు. కొనసన్నము. ఒక తీగె మీదనే కొన్ని తొడిమలు లేని ఆకులు కూడ గలవు.
పుష్ప మంజరి.
- కణుపుసందులందు స్త్రీ పుష్పములు పురుష పుష్పములు గలసి గుత్తులుగుత్తులుగా నున్నవి. పురుషపుష్పములకు వృంతముగలదు స్త్రీపుష్పములకు లేదు.