Jump to content

పుట:VrukshaSastramu.djvu/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గములను కోయుటయే మంచి పద్దతియైనను కొన్నిచోట్ల చెట్లక్రింద బట్టలు పరచి మొగ్గలను రాల గొట్టుదురు. పచ్చి మొగ్గలను ఎండ బాగున్నయెడల నెండలోనే పెట్టుదురు. లేదా, సన్నని మంట మీద నైనను, వేడి నీళ్ళలోనైనను కొంచెము సేపుంచి ఎండబెట్టుదురు.


పుష్పము చీలిక. జామ.


ఈచెట్ల కొమ్మలు పాతినను మొలచును. లవంగము సుగంధ ద్రవ్వ్యములలో నొకటి. వానిని మనము తాంబూలముల నందును, ఔషధములలోను, వాడు చున్నాము. లవంగములు మన దేశములో అంతగా పండుట లేదు. చాలవరకును మన మన్యదేశముల నుండి దిగుమతి చేసి కొను చున్నాము.