ర్ధమొక చెట్టు నందెక్కువయు మరియొక దాని యందు తక్కువయు నుండుట చేతను, ఏ చెట్టు నందెక్కువ యున్నది వానిని కోసి వేసిన గాని తెలియ రాకుండుట చేతను ఈ చెట్టు లాభకారకము లగుట లేదు. దీనిపండ్లు తినుటకు బాగుండునందురు. కలపయు బాగుగనే యుండును కాని ఎందుచేతనో వాడుకలో లేదు.
మద్ది కుటుంబము.
నల్లమద్ది:- చెట్టు పలుతావుల బెరుగు పెద్ద చెట్టు.
ఆకులు: కొంచమించు మించు అభిముఖ చేరిక, పైనున్నవి ఒంటరి చేరికయే. లఘు పత్రములు, సమ గోళకారము. అందాకారము. అడుగున రోమము లుండును. సమాంచలము విషమ రేఖ పత్రము. కొన సన్నము. తొడిమ చివర గ్రంధి కోశములు గలవు.
పుష్పమంజరి:- కణుపుసందులనుండి రెమ్మ కంకులు. మిధున పుష్పములు, ప్రతి పువ్వు వద్దను ఒక చేటీక గల్దు.
పుష్పకోశము:- సంయుక్తము. గొట్టమున వలె నుండును. అండాశయమున కంటె పొడగు. తమ్మె త్రిభుజాకారము. ఒక దాని నొకటి తాకు చుండును.
దళవలయము:- లేదు.
కింజల్కములు:- 10. పుష్ప కోశము నంటి యున్నవి. వీని మధ్యనొక పళ్ళెరము గలదు.
అండకోశము: అండాశయము నీచము. ఒకగది. రెండోమూడో అండములు వ్రేలాడుచు నుండును.