పుట:VrukshaSastramu.djvu/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పప్పుకూడ పనికి వచ్చును. ఈ చమురు సుగంధపు నూనెలలో వాడు చున్నారు. ఈనూనెకు మంచి పరిమెళము గలదు. ఈచెట్లనుండి మంచి జిగిరు కూడ వచ్చుచున్నది.

కాశిరేగు:- చెట్టు ఎత్తగు ప్రదేశములలో పెరుగు చున్నది. దీనిని పై దేశముల నుండి కొని వచ్చిపర్వతముల మీద పైరు చేయు చున్నారు. గింజలు కూడ మొక్కలు మొలచును గాని అంటు పాతిన మొక్కలంత బాగుగ నుండవు. వీనికి గంకరనేల మంచిది. మనము తిను పండు నిజమగు పండు గాదు. పువ్వున కడుగున నుండెడు కాడయె పెద్దదై నిజమగు కాయ నావరించి కండగట్టి పెరుగు చున్నది. ఈ పండ్లు పుష్టి చేయునందురు.

బెరికాయలు:- ఇవి కూడ కాశీరేగు పండ్లతో గలిపి అమ్ముదురు. ఇవియు నీల గిరి పర్వతముల మీదను, బెంగుళూరు వద్దను పైరు చేయు చున్నారు. దీనిని వర్షాకాలము ముందు కొమ్మలు పాతి పెంచెదరు. ఈ కాయలు చెన్న పట్టణమునకు బెంగుళూరు నుండి వచ్చుచున్నవి గాని అన్ని చోట్లను లేవు.

అలుబాలు:- చెట్టు పంజాబులో పెరుగు చున్నది. దీని కలప మిక్కిలి బాగుండును. ఇది కుర్చీలు బల్లలు చేయుటకు