Jump to content

పుట:VrukshaSastramu.djvu/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తగ్గినది. దీని వ్వవసాయము ఆయాప్రదేశముల శీతోష్ణ స్థితులను బట్టి పలు విధములగ నున్నది. నీలిమొక్కలలో తక్కువ రకములు గలవు. అది గాక నీలిరంగు యొక మొక్కనుండియే గాక ఇతర మొక్కల నుండి కూడ దీయు చున్నారు. కొన్ని చోట్ల నీలి విత్తనములు కందులు పెసలతో గలిపి చల్లెదరు. మరి కొన్ని చోట్ల బ్రత్యేకముగనే చల్లెదరు.

పొలమును గలియదున్ని గాబుదీసి ఎరువు వేసెదరు. అప్పుడు వర్షముండిన సరియే గాని, లేకున్నచో నీరు పెట్టి తిరిగి దున్ని సమము జేసి విత్తనములు చల్లుదురు. చల్లిన వారము దినములకు మొక్కలు మొలచును. మొలచినప్పటి నుండియు వారమునకో పదునైదు దినములకోతగినట్లు నీరు పెట్టుదురు. మొక్కలు మొలచి కొలది దినములలోనే విస్తారముగ వర్షము కురిచినను పూర్తిగ లేకుండినను చచ్చిపోవును. కొంచెమెదిగిన పిదప వీనికి పురుగు పట్టుటయు గలదు. అవి ఆకుల నన్నిటిని దినివేయును. వీనిని దొలగించుట కష్టము. కాన నామొక్కలను బెరికి వైచి క్రొత్తగా విత్తనములు చల్లవలెను. మొక్కలు పూర్తిగ నెదిగిన తరువాత వానిని గోసి బండిపై వేసి యంత్రశాలకు గొనిపోయెదరు. కోయగా మిగిలిన దుబ్బలు చిగిరించును. ఇట్లు రెండుమూడు మారులు కోసిన పిదప విత్తనములకై, ఆమొఒక్కల