Jump to content

పుట:VrukshaSastramu.djvu/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంటగనైనను చల్లుదురు. వీనిలో పెద్ద కందులు, చిన్న కందులు, తెల్ల కందులని రకములు గలవు. తెల్ల వాని కంటె ఎర్రనివి మంచిది. పెద్ద కందుల మొక్కలు కూడ పెద్దవియే. వాని పువ్వుల మీద నూదా చారలుండును. ఒక్కొక్కప్పుడు పురుగు పట్టి లేత కొమ్మలను దినివేయును. మరి యొకప్పుడు భూమిలో నుండి ఊరగాయల మొదలగు వాని మీద బట్టు బూజు వంటిది చెట్టులో ప్రవేశించి, ఆహార పదార్థ మందనీయ చెట్టును చంపి వేయును.

వర్తకులు రంగు బాగుగ నుండుటకు కొంచెము నూనె రాతురు. కంది కంప ఇండ్లపై కప్పులు వేసి కొనుటకును, దడులు కట్టు కొనుటకును వంట చెరుగుకను నుపయోగించుతురు. దీని బొగ్గును తుపాకి మందులో వాడ వచ్చును. కొన్ని దేశములందు లక్క పురుగును పట్టు పురుగును బెంచుటకీ పైరును సేద్యము చేయు చున్నారు.

పెసరమొక్క:- 2 అడుగుల ఎత్తు పెరుగును. ఆకుల తొడిమలు ఆకులంత పొడుగుగా నుండును. పువ్వులలో పెద్దరేకు యొక్క పై యంచులోపలికి మణిగి యుండును. నల్లపెసరమొక్క ఎక్కువగుబురుగానుండును. దానిపై నెక్కువ రోమములు గలవు.