పుట:VrukshaSastramu.djvu/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిక్కుడు కుటుంబము.

పైనున్నది పతాక దళము. అడుగున ద్రోణీదళము

చిక్కుడుతీగ.

ప్రకాండము:- తిరుగుడు తీగె. అడుగున గుప్పెడు లావున నుండును. దారువు గలదు. ఏకవార్షికము.

ఆకులు:- ఒంటరి చేరిక. మిశ్రమ పత్రములు. మూడేసి చిట్టి యాకులుండును. చిట్టియాకు, హృదయాకారము, సమాంచలము, విషమ రేఖ పత్రము. రెండు వైపుల ల్నున్నగ నుండును కొనసన్నము.

పుష్పమజరి.- గెల: ఒక్కొక్కప్పుడు దీని మొదట నాకులును గలుగు చుండును. పువ్వులు పెద్దవి. తెల్లగా నయినను నీలపు రంగుగా నయినను నుండును. అంతరాళము. సీతాకోక చిలుక వలె నుండును. చేటికలు, ఉపవృంతము వద్ద నొకటి పుష్పకోశము వద్ద నొకటి గలదు.

పుష్పకోశము:- సంయుక్తము. 5 దంతములు, నీచము.

దళవలయము:- 5 ఆకర్షణ పత్రములు. 1 అన్నిటి కంటే బెద్దదిగా నున్నది. ఇది పతాక దళము. పుష్పములో పొడుగుగా జండావలె నుండుటచే దీనికీ పేరు గలిగెను. దీని ముందు రెండు విడిగా నున్న రేకులు గలవు. ఇవి రెక్కల వలె నుండుటచే బక్షదళములందురు. వీని రెండింటిచే గప్పబడి చుక్కాను వంటి దొకటి గలదు. ఇది రెండు రేకులు గలసి ఏర్పడుచున్నది. దీనిని గ్రోణీదళమందురు. దళ వలయము పుష్ప కోశము నంటి యున్నది.