పుట:VrukshaSastramu.djvu/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కింజల్కములు:- 10 ఇవియు వంగి ద్రోణీదళములో మరుగుపడి యున్నవి. పదియు మొదట గొట్టము వలె గలిసి యున్నవి. పుప్పొడి తుత్తులు చిన్నవి.

అండకోశము:- అండాశయము ఉచ్చము. 1 గది, కీలము సన్నము. కీలాగ్రము గుండ్రము, మొదట నిది యు ద్రోణీదళములో మరుగున పడి యున్నది. ద్వివిధారుణ ఫలము.

చింతచెట్టు.

చింతచెట్టు:- మొగుల పెద్ద చెట్టు. అది పెక్కు చోట్ల బెరుగు చున్నది.

ఆకులు:- మిశ్రమ పత్రములు. పక్ష వైఖరి. చిట్టి యాకులు మిక్కిలి చిన్నవి. నిడివి చౌకపాకారము. సమాంచలము విషమ రేఖ పత్రము. కొనక్షిపుము.

పుష్పమంజరి:- కొమ్మల చివరల నుండి గెలలు పుట్టును. అదశ్చిర్గయండాకారము గల చేటిక ఒక్కొక్కపుషము వద్ద నొక్కొక్కటి గలదు.

పుష్పకోశము:- 4 రక్షక పత్రములు సన్నముగా నుండును. నీచము. త్వరగా రాలి పోవును.

దళవలయము:- ఆకర్షణ పత్రములు ఐదు. అన్నియు సమముగ లేవు గాని చిక్కుడు పువ్వుల వలె లేదు. ద్రోణీ దళములు సరిగా చుక్కాని వలె లేదు. పుష్ప కోశము నంటి యుండును.

కింజల్కములు:- 3. మరి నాలుగు చిన్న చిన్న కాడలు గలవు. ఇవి గొడ్డులయిపోయిన కింజల్కములు. పుప్పొడి తిత్తులు 2 గదులు.