బడ్డిచెట్టు నుండి జిగురు వచ్చును. ఈ జిగురును బెరడును మందులం దుపయోగించుదురు. బెరడుతో గాచిన కషాయము నోటి పూతకును చిగురు జబ్బులకును బని చేయును.
ఇవురుమామిడి:- చెట్టు చాల పెద్దదై యున్నప్పు దొక్కొక్కప్పుడు జిగురు కార్చు చుండును. జిగురు అంతయు మాను మొదట క్రింద పడి యుండును. ఈ జిగురును లేత కాయలను గూడ ఔషధములలో వాడుదురు. ఇవి అజీర్ణమునకు మంచి పని చేయును.
ములగ కుటుంబము.
ఈకుటుంబము చిన్నది. ఈ చెట్ల దారువు గట్టిగా నుండదు. ఆకులు ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు. పక్ష వైఖారి. చిట్టి యాకులొక దానై కొకటి ఎదురెదురు గానుండును. సమాచలము. వీని మొదట గ్రంధి కోశములు గలవు. పుష్పమంజరి కణుపు నందుల నుండి రెమ్మ గెలలు, పుష్పములు అసరాళములు, ఏక లింగ పుష్పములు, పుష్ప కోశము సంయుక్తము ఒక గిన్నె వలెనున్నది. 5 దంతములు, దీనికిని రంగు గలదు. ఆకర్షణ పత్రములు అన్నియు సమముగా లేవు. 5 కింజల్కములు,