పుట:VrukshaSastramu.djvu/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాయుదురు. సూదితోనైనను సన్నని పుల్లతో నైనను గీయ వలేను. అంత మేరయు రసము పూయ రాదు. పొక్కెక్కిన యెడల దానిని పొడిచి చీము కారనిచ్చి పిండి కట్టుట మంచిది. ఈ గింజలతో మందు చేసి లోపలకు కూడ నిత్తురు. కొందరు గింజలను బేడతో గలిపి కాచి నీళ్ళతో గడిగి లోపల కిచ్చెదరు. గాని ఇది మంచి పద్ధతి గాదు. ఈ జీడి గింజలను గల్వములో నూరుచు జీడి మామిడి గింజల పప్పును గలుపుచు దేనెను వేయుచు నూరి తగు మోతాదులుగ లోపలికిత్తురు.

గింజల రసము బట్టల కానవాళ్ళు వేయుటకు బనికి వచ్చును. కొన్ని చోట్ల బట్టలకు రంగు వేయుటలో కూడ దీనిని వాడు చున్నారు. ఈ చెట్లను గీయుట వలన నొక రసము వచ్చును. ఈ రసము వార్నీషు లలో ఉపయోగించెదరు.

కాకరశింగు:- చెట్లు హిమాలయా పర్వత ప్రాంతముల మొలచు చున్నవి. ఈ చెట్లపై పొక్కులు, పొక్కులు వంటివి గలుగు చుండును. వీని నౌషదములలో వాడుదురు. కొన్ని చోట్ల రంగు వేయుటలోని వీని నుపయోగించు చున్నారు.